మార్కెట్లోకి బజాజ్‌ ఆటో ఇవి ఆటోలు

మార్కెట్లోకి బజాజ్‌ ఆటో ఇవి ఆటోలుహైదరాబాద్‌ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ తమ నూతన కార్గో, ప్యాసింజర్‌ విద్యుత్‌ ఆటో శ్రేణిని తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రయాణీకుల ఇవి త్రీవీలర్‌ బజాజ్‌ ఆర్‌ఇఇ-టెక్‌ 9.0ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వాహనాలు విస్తృత పరిధి, అత్యధిక లోడ్‌ మోసే సామర్థ్యం, దీర్ఘకాలిక మన్నిక దృష్టితో రూపొందించినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు బాబ్జీ నెల్లి, కుబేర్‌ కెవి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా తమ డిస్ట్రిబ్యూషన్‌ సేవలను విస్తరించనున్నామన్నారు.