ఖమ్మం బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు వీరే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీర్‌ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు (పాలేరు), డీసీసీబీ మాజీ చైర్మెన్‌ కురాకుల నాగభూషణం, సీనియర్‌ నాయకులు తాళ్ళూరి జీవన్‌ (వైరా) , మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు (మధిర), సీనియర్‌ నాయకులు ఉప్పలపాటి వెంకట రమణ ( కొత్తగూడెం), సీనియర్‌ నాయకులు బీరెడ్డి నాగచంద్ర రెడ్డి (సత్తుపల్లి), సీనియర్‌ నాయకులు కోనేరు చిన్ని (అశ్వరావుపేట) సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.