– బిట్స్ -పిలానీ (హైదరాబాద్ క్యాంపస్), CBIT, JNTU TBI & AIC T-హబ్, హైదరాబాద్ EVangelise‘23 రోడ్‌షోలో పాల్గొన్నాయి
– EV ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి అత్యంత ప్రోత్సాహకరమైన అవకాశాలను తెరిచిన EVangelise‘23
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ టెక్-ఇన్నోవేషన్ ఆధారిత స్టార్టప్ ఇంక్యుబేటర్ iCreate (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టెక్నాలజీ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్ క్యాంపస్), పిలాని, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT), జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU) TBI మరియు AIC T-హబ్, హైదరాబాద్ భాగస్వామ్యంతో EVangelise’23 కోసం రోడ్‌షోలను హైద్రాబాద్ లో నిర్వహించింది. EV పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు వేగవంతం చేయడం, భారతదేశం యొక్క అతిపెద్ద EV ఆవిష్కరణ సవాలు అయిన EVangelise’23 కోసం ఆశాజనక EV స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలను గుర్తించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న EV పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించటం మరియు వేగవంతం చేయడం EVangelise’23 లక్ష్యంగా పెట్టుకుంది. బిట్స్ , పిలానీ(హైదరాబాద్ క్యాంపస్), JNTU TBI మరియు AIC T-hub నుండి 200 మందికి పైగా సృజనాత్మక ఆలోచనాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిట్స్-పిలానీ(హైదరాబాద్ క్యాంపస్)లో, హైదరాబాద్ క్యాంపస్ – బిట్స్ పిలానీలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ జనరల్ మేనేజర్ డాక్టర్ సందీప్ రౌత్, ఈఈఈ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంకుర్ భట్టాచార్జీ, మెకానికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పార్ధ సారధి గురుగుబెల్లి వెంకట మరియు EEE విభాగం (హెడ్ CIIE) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీష్ దీక్షిత్ హాజరయ్యారు. CBIT నుండి , చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి వి నరసింహులు మరియు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఉమాకాంత చౌదరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. JNTU TBI నుండి , JNTUH ఇన్నోవేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఎం . ఆశా రాణి, AIC T-Hub యొక్క సీఈఓ రాజేష్ కుమార్ A.; మరియు JNTUH TBI యొక్క సీఈఓ కార్తీక్ తాటికొండ, వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో మరియు భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమలో ఈ నైపుణ్యాలు ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనే విషయాన్ని చర్చించారు. ఎఐసి టి-హబ్‌లో టి-హబ్ సిఇఒ శ్రీ శ్రీనివాస్ రావు మహంకాళి, ఎఐసి టి-హబ్ సిఇఒ శ్రీ రాజేష్ కుమార్ ఎ, ఎఐసి టి-హబ్‌లో ఇంక్యుబేషన్ మేనేజర్ శ్రీమతి వర్షారాణి భగత్పాటిల్ మరియు అసోసియేట్, T-Hub శ్రీమతి నిఖితా యలవర్తి సహా ప్రముఖులు హాజరయ్యారు.
EVangelise‘23 రోడ్‌షోలు జూలై మరియు ఆగస్టు నెలల్లో ప్రముఖ సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిర్వహించటానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ చేయబడ్డాయి. సబ్జెక్ట్ నిపుణులు మరియు అగ్ర పరిశ్రమ నాయకులతో వ్యక్తిగతంగా సంభాషించడానికి మరియు అవకాశాలను అన్వేషించడానికి అభ్యర్థులకు అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఆర్థిక మరియు ఇంక్యుబేషన్ మద్దతుతో పాటు, మొట్టమొదటిసారిగా, EVangelise’23 పాల్గొనేవారు తమ వృద్ధిని వేగవంతం చేయడానికి వెంచర్ క్యాపిటల్ ఫండింగ్‌ను పొందే అవకాశాన్ని కూడా కలిగి ఉన్నారు. తన మూడవ సంవత్సరంలో, EVangelise’23 భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి మరియు స్వీకరణను వేగవంతం చేయడానికి వర్ధమాన వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడం తో పాటుగా ఈ రంగంలో ఆశాజనకమైన ఆవిష్కరణలకు ఉద్దేశించిన వినూత్నమైన జాతీయ సవాలు గా నిలిచింది. రోడ్‌షోల శ్రేణి ద్వారా, iCreate పరిశ్రమ నాయకులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు మరియు విధాన రూపకర్తలను ఏకతాటి పైకి తీసుకురావటానికి మరియు తమ పరిజ్ఞానం పంచుకోవడానికి మరియు స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్ల వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు మరియు ప్రభుత్వ ప్రతినిధులతో సహా ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు సంస్థలకు EVangelise‘23 ఇన్నోవేషన్ ఛాలెంజ్ తెరవబడింది. ఈ కార్యక్రమం లో పాల్గొనేవారు https://www.evangelise.org.in/ ద్వారా నమోదు చేసుకోవచ్చు. EVangelise’23కి దరఖాస్తులు సెప్టెంబర్ 24, 2023న ముగుస్తాయి.