చౌటుప్పల్ మండలంలో ప్రత్యేక అధికారులు వీరే

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని 25 గ్రామపంచాయతీలలో శుక్రవారం ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు తీసుకున్నారు. మండల తాహాసిల్దార్ శివకోటి హరికృష్ణ పంతంగి,గుండ్లబాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.సందీప్ కుమార్ అంకిరెడ్డిగూడెం, కొయ్యలగూడెం,ఎల్లంబావి గ్రామ పంచయతీలలో ప్రత్యేక అధికారులుగా ఛార్జి తీసుకున్నారు.దండు మల్కాపురం తూప్రాన్ పేట మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు,దామెర, చింతలగూడెం నాయబ్ తాహాసిల్దార్ బి.రాజేష్ రెడ్డి, అల్లాపురం,దేవలమ్మ నాగారం కే.సందీప్ రెడ్డి పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఎస్. లింగోటం ఎన్.మహేష్ రెడ్డి ఏఈ మిషన్ భగీరథ చిన్నకొండూరు పి.దీప ఏఈ ఇరిగేషన్,ధర్మోజి గూడెం,ఎల్లగిరి,కైతాపురం R.సోమేశ్వర్ డిప్యూటీ తాహాసిల్దార్ ఆర్డీవో కార్యాలయం,ఆరెగూడెం, కాట్రేవు ఎస్.శేఖర్ డిప్యూటీ తాసిల్దార్ ఆర్డీవో కార్యాలయం,మసీదుగూడెం,పెద్ద కొండూరు సాయిబాబా ఏఈ మిషన్ భగీరథ,పీపల్ పహాడ్,ఎనగండితండ శ్రీనివాస్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ మిషన్ భగీరథ జై కేసారం,నేలపట్ల ఏ.శ్రవణ్ కుంట్లగూడెం,మందోల్ల గూడెం బి.పృధ్విరాజ్ వెటర్నరీ డాక్టర్లు గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా అదనంగా పదవి బాధ్యతలు తీసుకున్నార మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.సందీప్ కుమార్ తెలిపారు.