అంతర్ పాఠశాలల క్రీడ విజేతలు వీరే 

These are the winners of inter-school sports– టోర్నమెంట్ ఓవరాల్ ఛాంపియన్ గా చౌట్ పల్లి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన మండల అంతర్ పాఠశాలల క్రీడలు శనివారం రాత్రి ఘనంగా ముగిసాయి. క్రీడల్లో విజేత జట్లకు రాష్ట్ర సహకార సొసైటీ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బహుమతులను అందజేశారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో జరిగిన క్రీడా పోటీల్లో మండలంలోని 14 గ్రామాల నుండి  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు క్రీడ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో జరిగిన క్రీడా పోటీల్లో పలు పాఠశాలలు విజేత జట్లుగా నిలిచాయి.
 జూనియర్ విభాగంలో…..
కబడ్డీ బాలుర విభాగంలో బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.కబడ్డీ బాలికల విభాగంలో బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, శ్రీ విద్య సాయి ఉన్నత పాఠశాల ద్వితీయ, కమ్మర్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఖోఖో బాలుర విభాగంలో శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు గెలుపొందాయి.ఖోఖో బాలికల విభాగంలో కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. వాలీబాల్ బాలుర విభాగంలో శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల ప్రథమ, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు  గెలుపొందాయి. వాలీబాల్ బాలికల విభాగంలో శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, హాస కొత్తూర్ ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు  గెలుపొందాయి.
సబ్ జూనియర్ విభాగంలో…..
కబడ్డీ బాలుర భాగంలో బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, కోనా సమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.కబడ్డీ బాలికల విభాగంలో చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఖోఖో బాలుర విభాగంలో చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు గెలుపొందాయి.ఖోఖో బాలికల విభాగంలో చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ బహుమతి గెలుచుకున్నాయి.వాలీబాల్ బాలుర విభాగంలో చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల ద్వితీయ, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు  గెలుపొందాయి.వాలీబాల్ బాలికల విభాగంలో విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల ప్రథమ, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, చౌట్ పల్లి జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల తృతీయ బహుమతులు  గెలుపొందాయి.
టోర్నమెంట్ ఓవరాల్ ఛాంపియన్ గా చౌట్ పల్లి 
మండల అంతర్ పాఠశాలల క్రీడల్లో అత్యధికంగా ఎనిమిది  బహుమతులు గెలుచుకొని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. కోన సమందర్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థులు ఎనిమిది, శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా ఎనిమిది బహుమతులు గెలుచుకున్నారు.బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడు బహుమతులు, విజ్ఞానజ్యోతి ఉన్నత పాఠశాల విద్యార్థులు నాలుగు బహుమతులు గెలుపొందారు. హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మూడు బహుమతులు గెలుపొందగా, కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మిసిమి ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ఒక్కో బహుమతి గెలుపొందారు.విజేత జట్లను బహుమతుల ప్రధానం కార్యక్రమంలో పాల్గొన్న ఆహుతులు అభినందించారు.