– కాంగ్రెస్ పార్టీ వల్లే బెంగళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు : బెంగుళూరు లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి
యశ్వంత్‌పూర్: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బెంగుళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, హస్తం పార్టీ చేసిన
కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ ను మూడుసార్లు గెలిపిస్తే బెంగుళూరుకు ఏం చేశారు? అని ప్రశ్నించారు.పార్లమెంట్ లో బెంగుళూరుకు కావాల్సిన నిధుల గురించి ఏనాడు అడగలేదనీ, తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని కేంద్రాన్ని అడగడంలేదన్నారు.
కావేరీ జలాల వివాదం పరిష్కారం గురించి నోరెత్తలేదని, ఏ రోజైనా పీసీ మోహన్ లోక్ సభలో కర్నాటక సమస్యల గురించి మాట్లాడారా..?అని ప్రజలను రేవంత్ ప్రశ్నించారు.పల్లీ,బఠానీ తినడానికి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాలుకు పోవాల్సిన అవసరం లేదు… బెంగుళూరు బస్టాండ్ లో కూడా దొరుకుతాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా..ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ… పదేండ్లలో 7లక్షల 21వేల 680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు..దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని వివరించారు..దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు మోడీకి ఓటు వేయాలా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ… రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా?అని ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు సరికదా… దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మోడీ కల్పించారు..నల్లధనం వెనక్కి రప్పించి జన్ ధన్ ఖాతాల్లో రూ. 15లక్షలు వేస్తామన్నారు..
మీలో ఎవరికైనా రూ.15లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా?
నరేంద్రమోడీ అంటేనే నమ్మించి మోసం చేయడమేనన్నారు.కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీ నేతలను ఒక్కటే అడుగుతున్నా…యడ్యూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్.. ఆయన కొడుకు విజయేంద్ర కర్నాటక పార్టీ అధ్యక్షుడు… ఆయన కొడుకు రాఘవేంద్ర ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నడు..పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ… గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుర్లు ఎంపీలు..రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి.. ఆయన కొడుకు ఎమ్మెల్యే…మీ పార్టీలో ఉన్నోళ్లంతా చేసేవి కుటుంబ రాజకీయాలే.. మీరా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేది?నిలదీశారు.ఇచ్చిన మాట ప్రకారం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? నమ్మించి మోసం చేసే నమోకు ఓటు వేస్తారో ఆలోచన చేయండి…అని రేవంత్ పిలుపునిచ్చారు.