నవయుగ సంఘర్షణలు ఈ కథలు

నవయుగ సంఘర్షణలు ఈ కథలు– డా||ఎస్‌.కె.సాబిరా
I am no bird, and no net ensnares me; I am a free human being with an independent will. Which I now exert to leave you.( Charlotte Bronte, Jane Eyre-1847)
(నేను పక్షిని కాదు. ఏ వలా నన్ను బంధించలేదు, నేనో స్వేచ్ఛా జీవిని. స్వతంత్ర అభిప్రాయాలతో ఉన్నాను. ఇప్పుడు నిన్ను విడిచి పెట్టడానికి ఎంతో బాధపడుతున్నాను. (షార్లెట్‌ బ్రోంటే, జేన్‌ ఐర్‌-1847))
ªI Know what I want, I have a goal, an opinion… let me be myself and then I am satisfies, I know that I am a women a woman with inward strength and plenty of couragew” (Anne frank, The diary of a young girl. 1942- 1944)
(”నాకేం కావాలో నాకు తెలుసు. నాకో లక్ష్యం ఉంది. ఒక అభిప్రామూ ఉంది… నన్ను నన్నుగానే ఉండనిస్తేనే నాకు తప్తి. నేనో మహిళనని తెలుసు. ఒక మహిళ లోపలి నుంచి ఎంత బలంగా, ధైర్యంగా ఉండగలదో ఇంకా బాగా తెలుసు.” (అన్నే ఫ్రాంక్‌, ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌. 1942-1944))
ఈ రెండు కొటేషన్స్‌ మధ్య నూరేళ్ళ ప్రయాణం ఉంది. అయినా పరిస్థితులలో ఎటువంటి మార్పు లేదు. కట్‌ చేస్తే 2024లో దాస్తాన్‌ కథలు చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొన్ని సంవాదాలు పాఠకులను ఆలోచనల్లో పడేస్తాయి.
”పుట్టుకతో నేను మేధావినే… నా చుట్టూ ఉన్న సమాజమే నన్ను పిరికిని చేసింది.” ఇక్కడ రచయిత్రి Simone de Beauvoir అసంకల్పితంగా గుర్తుకు వస్తుంది. తాత్వికత నిండిన మాటలతో ప్రపంచాన్నే తాదాత్మ్యతా ఒడికి చేర్చిన గొప్ప ఉద్యమకారిణి ఆమె.
One is not born, but rather becomes, a women.μμ (The Second Sex 1949). ఒక పెద్ద విమర్శకు పునాది అయిన చర్చ ఆ పరంపర నుంచే వచ్చింది. ఈ దాస్తాన్‌ లో నస్రీన్‌ ఖాన్‌ తనదైన శైలిలో – ”సమస్య తెలుసుకున్నాను. పరిష్కారం దిశగా పోరాటమే చేస్తున్నానిప్పుడు” అంటారు.
TS Eliot ఒక వ్యాసంలో ఇలా చెప్తారు… ఒక రచయిత తన సాహిత్య పరంపరను కొనసాగించడానికి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
నస్రీన్‌ ఖాన్‌ ఒక రచయిత. మహిళా రచయిత. ముస్లిమ్‌ మహిళా రచయిత. ఈ విషయం అర్ధమయినప్పుడు కచ్చితంగా మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పాఠకులకుగాని, విమర్శకులకుగాని ఒక అవగాహన వస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన సమాజానికి న్యాయం చెయగలుగుతాం.
‘దేహంపైని గాయాలు మానతాయి. కానీ, మనసుపైనున్న గాయాలు మానడం చాలా కష్టం’ అంటారు అజ్గర్‌ అలీ ఇంజినియర్‌.
దాస్తాన్‌ లోని పది కథలలోని పాత్రలు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను చూస్తుంటే ఈ కాలంలోనూ ఇటువంటి హింస కొనసాగుతుందా అనే ఆవేదన కలుగకమానదు. జుగుప్సాకరమైన రాజకీయాలకు దశాబ్దాలుగా బలవంతంగా బలవుతున్న సమాజానికి ఈ కథలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందుకు ‘లాపతా’ కథను ఉదాహరణగా చెప్పవచ్చు.
రఫీఖాను మాధ్యమంగా చేసుకుని కథను మలుపు తిప్పిన విధానం ఎంతో బాగుంటుంది. కథ చదువుతున్నప్పుడు ఇటువంటి కథ ఇంతకు మునుపు చదివామని అనిపిస్తుంది. కానీ, నస్రీన్‌ ఖాన్‌ రాసిన ఈ కథ మరో ఎత్తు. సమకాలీన పరిస్థితులకు సరికొత్త కోణాన్ని అద్దారు. దాంతో ప్రత్యేక కథల కోవలోకి చేరుతుంది. ఇక్కడ మళ్ళీ ఇలియట్‌ గుర్తుకు వస్తాడు. సాంప్రదాయం, ఆధునికతల మేలు కలయికల సరికొత్త పరిమళాలు వెదజల్లుతుందీ కథ.
”మొగోని లెక్కనే ఇంటిని సంభాలించిన – కనురెప్పలు వేగంగా కదిలిస్తూ మనవారాళ్లను ఉద్దేశించి అన్నది” ప్రతి ఇంట్లో అమ్మ చేసే పని అదే. కానీ పురుష ప్రధాన సమాజంలో దానికి గుర్తింపే ఉండదు.
ఈ కథలు కొన్ని సందర్భాలలో అడ్వాన్స్‌డ్‌ గా కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు దిశమార్చుకున్న గాలి. ఈ కథలో జైనబ్‌, ముంతాజ్‌ల మధ్య సిస్టర్హుడ్‌ చక్కగా కనిపిస్తుంది. జైనబ్‌ తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతం… ”అతడు నాకు స్పర్మ్‌ డోనర్‌ తప్ప మరేమీ కాదు.” అంటుంది పాత్ర.
స్త్రీ స్వరం ఒక సోషియో- పొలిటికల్‌ వాయిస్‌ (Socio-Political Voice) గా మారడం మొదలై వందేళ్లకు పైబడింది. సమాజం మారింది. నిజమే. స్త్రీ పట్ల ఉన్న వివక్ష కూడా సరికొత్త రూపాలు మార్చుకుంటున్నది. దీనికి నిదర్శనమే ఈ దాస్తానాలు.
తెలుగులో ముస్లిం సమాజ సాహిత్యం తెలుగు సాహిత్యానికి ఒక కొత్త చేర్పు అని ఇదివరకే గుర్తించారు. అయినప్పటికీ ముస్లిం రచయిత్రులు, ముస్లిం స్త్రీల రచనల కోణం నుంచి చూస్తే అంత సంతోషకరమైన పరిణామమేమీ కనపడదు. పరిస్థితి ఇంకా చీకటిగానే ఉంది. ఈ దాస్తాన్‌ ఆ చిక్కటి చీకటిని కొంతైనా ఛేదించే ఒక ఆశా కిరణం అనిపిస్తుంది.
ఇదివరకు చెప్పినట్టు నస్రీన్‌ ఖాన్‌ ఒక రైటర్‌. ముస్లిం స్త్రీల వరకే పరిమితమైపోని వ్యక్తిత్వం ఆమెది. పలు విధాలుగా దాస్తాన్‌ కథల సంపుటి విశిష్టతను గుర్తించవచ్చు.
భరోసా ఒకరు ఇస్తే వచ్చేదికాదు. అది మనకు మనమే లోపలనుంచి పెంచుకోవలసి వస్తుంది. అది ఏ బాంధవ్యమైనా, ఎవరి గురించి అయినా. ఇలాంటి కథనాలు, కథలు కొత్త ఏమీకాదు. కానీ చెప్పే పద్ధతి, తీసుకున్న నిర్ణయాలు చాలా కన్వెన్సింగ్‌గా ఉన్నాయి.
నయాదౌర్‌ కథ ఎంతగా ఆలోచింపచేస్తుందో! నిస్సందేహంగా కాలం మారింది. కానీ, ఆలోచనలు? ఆలోచనలు మటుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.
కాలానికి తగినట్లుగనే దోపిడీ పంజా బలం పుంజుకుంటున్నాకొద్దీ సరికొత్త చైతన్యం ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇదే నవ యుగానికి సూచిక.