ఏ సమస్య వచ్చినా కలవండి..అందుబాటులో ఉంటా..

– మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏసమస్య వచ్చినా నన్ను కలవండని, ఏప్పుడూ అందుబాటులో ఉంటాననీ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలు అదైర్యపడవద్దనీ, భవిష్యత్తు మనదేనని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. అభివృద్ధి చేసినప్పటికీ, ఓటమి చెందడం బాధ కలిగించిందన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పార్టీ ముఖ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలనీ పిలుపునిచ్చారు. అలాగే బహుభాష కోవిదులు దేశం గర్వించదగ్గ నేత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.