నిఘా నేత్రాన్ని ధ్వంసం చేసేస్తున్నారు..

They are destroying the surveillance eye.– నాగిరెడ్డిపేట మండలంలో 36 సీసీ కేంద్రాల ఏర్పాటు చేసిన పోలీసులు.
– ఏడు కెమెరాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 

– వంశం చేయడం దొంగల పనేనా… ఇంకెవరైనా చేశారా..
నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో పోలీసులు ఎలాంటి దొంగతనాలు జరగకూడదని ఉద్దేశంతో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని మండల కేంద్రంలో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటుచేసి సంవత్సరం తిరగకుండానే ఏడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం కాలబెట్టడం జరిగింది.
కావాల్సింది ధ్వంసం చేస్తున్నారా…
మండల కేంద్రంలో దొంగతనాలు నివారించడంతోపాటు ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగిన అందులో రికార్డు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి శాంతి భదతలకు విఘాతం కలగకుండా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఉంటే తమ పనులు కావడం లేదని ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలు నాశనం చేయడం జరుగుతా ఉంది. 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ప్రధాన కోడలా వద్ద ఏర్పాటు చేసిన ఏడు సీసీ కెమెరాలును పగలగొట్టడం కాలబెట్టడం చేయడం జరిగింది. ఏదైనా చేయకూడని పనులు చేసే వ్యక్తులు ఈ పనులను చేస్తున్నారా అని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలి..
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం వల్ల ప్రజాధనం వృధా కావడంతోపాటు చట్టానికి విరుద్ధంగా చేసే పనులు యధావిధిగా యధాచగా చేసే అవకాశం ఉంటుంది. సంబంధిత శాఖ అధికారులు సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్న ముఠాను పట్టుకొని తగిన శిక్ష పడే విధంగా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు..
సీసీ కెమెరాల మరమత్తు..
ప్రధాన కోడల వద్ద ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు సోమవారం రోజు పోలీసులు మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. మరమ్మలు చేసిన అంతరం సీసీ కెమెరాలపై సంబంధిత శాఖ అధికారులు నిగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..