బహిరంగ ప్రదేశాల్లో, బడుల్లో తాగేస్తున్నారు..!

They are drinking in public places and restaurants..!నవతెలంగాణ – మల్హర్ రావు
మందు బాబులు మండలంలోని ఇప్పలపల్లి, తాడిచెర్ల, కొయ్యుర్, మల్లారం,పెద్దతూoడ్ల,కిషన్ రావుపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారుల ప్రక్కనున్న కల్వర్టులు,బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రభుత్వ బడుల్లో సైతం బహిరంగంగానే మద్యం సేవిస్తుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు ఆదిశగా చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పలపల్లి, వళ్లెంకుంట,రుద్రారం ప్రభుత్వ పాఠశాలల్లో మందు బాబులు మద్యం సేవించడమే కాకుండా సేవించిన ఖాళీ సీసాలు ధ్వంసం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురివుతున్న పరిస్థితి.నిత్యం అనేక మంది మందు బాబులు బీరు సీసాలతో దర్శనమిస్తున్నారు.ఇప్పటికైనా పోలీలిస్ అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
సీసాలు పగుల గొడుతు..
బహిరంగ ప్రదేశాల్లో పంట భూముల పక్కన మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను పగుల గొట్టి పంట భూముల్లో వేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్దందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పాలం భూముల్లో వేయడంతో రైతులు నీరు పెట్టి జమ్ము చేసే సమయంలో కాళ్లకు కుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపైనే పగుల గొడుతున్నారు. దీంతో రోడ్ల వెంబడి వెళ్లేవారు ఆ ప్రాంతాల్లో వెళ్లాలంటేనే జంకుతు న్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి బహి రంగ ప్రదేశాల్లో విచ్చల విడిగా మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరు తున్నారు.