బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, గృహలక్ష్మి పథకాల్లో అర్హులకు లబ్ధి చేకూరక పోవడంతో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడి గడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్లు కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు కుటుంబం అవినీతికి ఇది సాక్షంగా చూపుతూ విపక్షాలు, ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ సంది గ్ధంలో పడింది. దీనికితోడు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు అందరూ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ కాస్త బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ‘ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా’ అనడం… ఓటమికి చేరువైన ట్టేననే అర్థం వస్తోంది.
అసలే చలి చుట్టుముడుతోంది. వాతావరణంలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో పాటే ప్రజ లు కాలానిక నుగునంగా మారుతున్నారు. ఇక పట్టణాల్లో అయితే చలి పెరిగితే చాలు చారుకొట్టు, బజ్జీల కొట్టు వద్దకు తుమ్మెదల్లా వాలిపోతున్నారు. మధ్యలో తుమ్మెద ఎందు కొచ్చిందని అనుకుంటున్నారా…? తుమ్మెదకు ఓ గుణం ఉంది. తేనె ఉండే పువ్వులు కనిపిస్తే చాలు వాలిపోతుం టాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా తుమ్మె దలానే ఉంటున్నాయి. ఎక్కడ మనీ, సీటు ఉంటే అక్కడే నాయ కులు తుమ్మెదల్లా వాలిపోతున్నారు. ఎందుకంటే ఇది ఎన్ని కల సీజన్-2023 కాబట్టి. ఈ యేడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల దృష్ట్యా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా అనేక పార్టీల్లోనూ రాజకీయం పుంజుకుంటోంది. పొత్తులు, ఎత్తులు, వ్యూహాలతో రాజకీయ చతురత చూపుతు న్నారు. మేనిఫెస్టోలు, వాదోపవా దాలు, చర్చలు, సర్వేలు, సవాళ్లతో రాజకీయం హీటెక్కుతోంది. గెలుపు తమదంటే తమదే నంటూ తేగేసి చెబుతున్నారు. పథకాలు, గ్యారెంటీలు అంటూ మాయ జేసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడోసారి ముచ్చటగా అధికార పగ్గాలు చేపట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కర్నాటక విజయ దరహాసంతో కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒక్కసారి అవకాశమివ్వండంటూ అధికారం చేజి క్కిచ్చుకునే పనిలో పడింది. బీజేపీ సైతం ఒకపక్క అన్నీ ఊసిపోతున్నా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు జిమ్మిక్కులు చేస్తోంది. ఏకంగా బీసీని ముఖ్య మంత్రి చేస్తామంటూ ప్రకటించింది. మొత్తంగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎందుకంటే బీజేపీ కులమత రాజకీయాలు, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడడమే కాకుండా కార్మిక, కర్షక, ప్రజా హక్కులు కాలరాస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో రైతులపై చేయించిన దమనకాండ చరిత్రలో మరిచిపోలేనిదిగా మిగిలిపోయింది. ప్రజలు కూడా బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. అయినా రాష్ట్రంలో అధికారం చేజిక్కి చ్చుకునేందుకు మత విద్వే షాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీ వల ఓ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీకి అధికారమిస్తే రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలాంటి ప్రకట నలు హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించవా? అధికారంలోకి రావాలంటే ప్రజల కోసం పనిచేయాలి. వామపక్షాల వలే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరా డాలి. వారి యోగక్షేమాల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలి. అప్పుడు ప్రజలు గుర్తిస్తారు. కానీ ఇలాంటి విద్వేషాల వల్ల ఆ ఆపార్టీ పలచన కావడమే తప్ప వేరే లేదు.
ఇక బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, గృహలక్ష్మి పథకాల్లో అర్హులకు లబ్ధి చేకూరకపోవడంతో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడి గడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్లు కుంగిపోవడం చర్చ నీయాంశంగా మారింది. కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు కుటుంబం అవినీతికి ఇది సాక్షం గా చూపుతూ విపక్షాలు, ప్రతిపక్షాలు విరు చుకు పడుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ సంది గ్ధంలో పడింది. దీనికితోడు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు అందరూ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ కాస్త బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ‘ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా’ అనడం… ఓటమికి చేరువైన ట్టేననే అర్థం వస్తోంది. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు పోలీసు శాఖ కూడా అప్రమత్తం అయింది. డబ్బు అక్రమ రవాణా, ఓటర్లను లొంగదీసు కునేందుకు మద్యం, విలువైన వస్తువుల సరఫరా కాకుండా నిఘా పెట్టింది. చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల అవినీతి డబ్బు కోట్ల రూపాయల్లో పట్టుబడింది. కాగా ఇప్పటికే ఆయా నియోజక వర్గాల్లో ఆయా పార్టీలు డబ్బులను అక్రమ రవాణా చేసినట్టు ఆరోపణ లొస్తున్నాయి. మొత్తంగా పార్టీలు అన్నీ ఓటును కొనుగోలు చేసే పనిలో పడినట్టు అర్థమవుతోంది. అధికార పగ్గాలు చేజిక్కిచ్చుకు నేందుకు కోట్ల రూపాయలు కుమ్మరించి ఓట్లు కొల్లగొట్టేం దుకు తుమ్మెదల్లా వాలిపోతున్నాయి. ఇప్పటికే విజయభేరీ సభలు, ఆశీర్వాద సభలు అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఓటుకు నోటు, మద్యం పంచుతూ పార్టీలు బలా బలాలు తేల్చుకుంటున్నాయి. ఇప్పటికైనా ఓటరు మేలుకుని అభివృద్ధి చేసే నాయకులను గుర్తించి ఎన్నుకో వాల్సిన సమ యం ఆసన్నమైంది. ప్రలోభాలకు, మాయమాటలకు లొంగ కుండా ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలి. లేదంటే పాత సీసాలో కొత్తసారాయి అన్న చందంగా షరామామూలే అవుతుంది.
– వేముల క్రాంతికుమార్, 9676717377