నవతెలంగాణ – బెజ్జంకి
పంట సాగుకు రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని మాజీ జెడ్పీటీసీ కనగండ్ల కవిత గురువారం విమర్శించారు.ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక విడతల వారీగా రుణమాఫీ చేస్తామని ప్రకటించడం రైతులపై చూపుతున్న కపట ప్రేమకు నిదర్శమని మాజీ జెడ్పీటీసీ కవిత ఆరోపించారు.ఇప్పటికైనా ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.