బరిలో నిలిచేది వీరే..

– రంగారెడ్డి జిల్లా 8 నియోజకవర్గాల్లో 211 మంది పోటీ
– మొత్తం నామినేషన్లు 280 పరిశీలన తొలగించినవి 31
– 38 మంది ఉపసంహరణ 211లో ఆ 8 మంది ఎవరో..!
– ప్రధాన పార్టీల మధ్యే పోటీ
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీలో ఉండేవారు ఎవరో స్పష్టమైంది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. బరిలో చాలా మంది
ఉన్నప్పటికీ పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండనుంది.
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 280 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వివిధ కారణాలతో దరఖాస్తుల పరిశీలనలో భాగంగా 31 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తొలగించారు. మరో 38 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 211 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
జిల్లాలో అత్యధికంగా నామినేషన్లు దాఖ లు చేసిన నియోజకవర్గం జాబితాలో ఎల్‌బీనగర్‌ నిలిచింది. ఇక్కడ 62 నామినేషన్లు వేయగా.. 5 దరఖాస్తులు తిరష్కరించబడగా, 9 మంది విత్‌డ్రా చేసుకోగా ప్రస్తుతం 48 మంది బరిలో నిలిచారు. అత్యల్పంగా నామినేషన్లులు దాఖలు చేసిన జాబి తాలో చేవెళ్ల నిలిచింది. ఇక్కడ 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులు చేసుకోగా నాలుగు దర ఖాస్తులు తిరష్కరించారు. మరో ముగ్గురు విత్‌డ్రా చేసుకోగా ప్రస్తుతం 12 మంది బరిలో ఉన్నారు.
ఎనిమిది నియోజకవర్గాలు.. 211 మంది అభ్యర్థులు
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 211 మంది విజయం సాధించి ప్రజాప్రతినిధిగా ప్రాతిని ధ్యం వహించేంది మాత్రం ఎనిమిది మంది మాత్రమే. ఈ ఎనిమిది ఎవరు అనేది తేలాల్సి ఉంది.
వికారాబాద్‌ జిల్లా :
వికారాబాద్‌ జిల్లాలో తాండూర్‌ నియోజక వర్గంలో 21 మంది బరిలో ఉన్నారు. నలుగురు విత్‌ డ్రా చేసుకున్నారు. కొడంగల్‌లో మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. ఇద్దరు ఉపసంహరించుకోగా.. ఒకరిది స్క్రూటీలో తిరస్కరించారు.
అసెంబ్లీ దరఖాస్తులు తిరష్కరణ వ్యాలిడ్‌ విత్‌డ్రా అభ్యర్థులు
ఇబ్రహీంపట్నం 39 4 35 7 28 ఎల్‌బీనగర్‌ 62 5 57 9 48
మహేశ్వరం 34 2 32 5 27
రాజేందర్‌నగర్‌ 33 7 26 1 25
శేరిలిగంపల్లి 41 5 36 3 33
చేవెళ్ల 19 4 15 3 12
కల్వకుర్తి 28 1 27 3 24
షాద్‌నగర్‌ 24 3 21 7 24
మొత్తం 280 31 249 38 211