
– మీనాజీపేట ఘటనపై డివిజన్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు
– బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని మంథని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ ఆరోపించారు. మహాముత్తారం మండలం మినాజీపేట ఘటనపై మంథని ఎన్నికల అధికారి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు మంథని నియోజకవర్గంలోని కొన్నేళ్లుగా పరిపాలన చేసిన కాంగ్రేస్ నాయకులు మళ్లీ ఈసారి కూడా అధికారంలోకి రావాలని అడ్డుగా తనను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేర చరిత్ర ఉన్నోళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ మంథనిలో అరాచకాలు చేస్తూ తమపై అరోపణలు చేస్తూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మాజీ నక్సలైట్లు, రౌడీయిజం చేసోటోళ్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు.ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ సర్పంచ్ బక్కారావుకు మహాముత్తారం మండలం మీనాజీపేటలో ఏం పని ఉందని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ ఏజేంట్ కాకుండా అర్థరాత్రి వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఓటర్లకు డబ్బులు పంచే క్రమంలో అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మందల రాజిరెడ్డి, అనిల్‌రెడ్డి అడ్డుకుంటే దాడికి పూనుకున్నారని, ఈ ఘర్ణణలో రాజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయన్నారు.అయితే ఈ ఘర్షణలో ఎలాంటి గాయాలు కాకుండా తానే గాయం చేసుకుని తమపై అబండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. అయితే జరిగిన సంఘటనపై బాధ్యత వహించాలని డిమాండ్ చేయాల్సింది పోయి పుట్ట మధూ నీ అంతు చూస్తా,నిన్ను చంపేస్తా అంటూ బీఆర్‌ఎస్ నాయకుల ఇండ్లపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయాలంటూ బక్కారావు పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
|