– ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం
– సొమ్ము చేసుకుంటున్న గల్ఫ్ ఏజెంట్లు
నవతెలంగాణ – భీంగల్
ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులని, కట్టుకున్న భార్యను, కనిపించిన పిల్లలను వదిలి ఉన్న కాస్త కొత్త భూమిని అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బులకు మరికొంత అప్పుచేసి పుట్టకోటికై గల్ఫ్ దేశాలు వెళుతున్న వారికి అక్కడ సరైన ఉపాధి దొరకక వెళ్లేటప్పుడు చేసిన అప్పులు తీరక, కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరికొందరైతే చేసేదేమీ లేక ఆత్మహత్యలే శరణ్యం మంటున్నారు. అలాంటి కుటుంబాలు ఎన్నో వీధిన పడుతున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం వారికి అండగా నిలవలేకపోతున్నాయి. అధికారంలోకి రాకముందు గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను గుప్పిస్తూ తీరా అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎంతోమంది పోరాటం చేసినను వారికి అది తీయని కలగానే మిగిలిపోతుంది. ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. దాదాపు 30 నుండి 40 శాతం మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గల్ఫ్ బాటే శరణ్యం అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ

ఎక్కువైతున్న ఏజెంట్ల మోసాలు…
గ్రామాలలో ఉపాధి లేక ఉన్న యువకులను గుర్తించి వారికి గల్ఫ్ ఆశ చూపి అలాంటి వారిని నట్టేట ముంచుతు పట్టపగలే ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు. గల్ఫ్( దుబాయ్ కత్తర్ మస్కట్ ఒమన్) లాంటి దేశాలు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తి నుండి లక్ష యాభై నుండి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కానీ అక్కడి వీసా పని వివరాలను వారికి తెలియజేయక పంపిస్తున్నారు దీంతో వారు ఒక్కడికి వెళ్లిన తర్వాత నకిలీ వీసాలు మరియు కొందరికి పని లేక, మరికొందరు కంపెనీలలో వెట్టి చాకిరీ చేసినాను జీతాలు అందక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఆత్రుత చూపుతున్న యువకులను మచ్చిక చేసుకుంటున్న పాస్ పోర్ట్ ఏజెంట్లు వేలు దండుకుంటున్నారు.
గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం..
ఏ ప్రభుత్వాలు వస్తే ఏంటి మా గల్ఫ్ కార్మికుల జీవితాలు మాత్రం మారలేకపోతున్నాయని గల్ఫ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడంతో రోజురోజుకు నిరుద్యోగం ఎక్కువైపోతుంది. అధికారంలోకి రాకముందు గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని వారి సంక్షేమానికి కృషి చేస్తామని ప్రగల్బాలు పలుకుతూ అధికారంలోకి వచ్చాక వాళ్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏదైనా కారణం చేత అక్కడ మరణిస్తే ఆశవం తమ కుటుంబ సభ్యులకు ఏప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది.