– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
నవతెలంగాణ-షాద్‌నగర్
గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారనీ , ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుందని నాడు తప్పు చేశారు నేడు అనుభవిస్తున్నారనీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డి గూడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనేకమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో అక్రమంగా కలుపుకున్నప్పుడు అది తప్పని అనిపించని కేసీఆర్ ఇప్పుడు ఇతరులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని పలుచగా చూసి ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు చెడు సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు అదే అనుభవిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో సొంత స్వార్థం కోసం పనిచేసేవారు ఎప్పుడు బాగుపడరని, ప్రజల కోసం పనిచేసిన వాళ్లే నిలదొక్కుకుంటారని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రాబోతుందని, ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి, బూర్గుల కుమార్ గౌడ్, బూర్గుల వెంకటయ్య గౌడ్, గంధం ఆనంద్, అప్పన్న గారి భాస్కర్ రెడ్డి, దాసరి అనంతయ్య, కందూర్ అంజయ్య గౌడ్ కావలి నరసింహులు, చిల్కమర్రి కష్ణయ్య, బాబు నాయక్, కమ్మదనం కుమార్, భూపతిరెడ్డి, ఎర్రోళ్ల అనంతయ్య, బుచ్చోళ్ళ నారాయణ, రమేష్, బక్కని కష్ణయ్య, గంటల శంకరయ్య, పట్నం బాలరాజు, బక్కని శీను, రాజు, కుమ్మరి శీను, చిన్న నర్సింలు, సాదక్ పాషా, లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల రామకష్ణ, వీరేష్ గౌడ్, శివయ్య, రమేష్ పాల్గొన్నారు.