– బీఆర్‌ఎస్ అసమ్మతినేత పిల్లి రామరాజుయాదవ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంగా ఎన్నికల కోసం కనగల్ మండలం ముఖ్య కార్యకర్తలకు సంసిద్ధులు కావాలని, ఎమ్మెల్యేగా బరాబర్ పోటీలో ఉంటానని బీఆర్‌ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. ఆదివారం కనగల్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో కనగల్ మండలంలోని 50 బూతులకు సంబంధించిన 2000 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తనపై అనేక రకమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరు కూడా నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ముఖ్య కార్యకర్తలంతా సమన్వయంతో సర్దుబాటు చేసుకొని ఓట్లను రాబట్టుకోవడానికి అందరూ నిర్విరామంగా కషి చేయాలని వారన్నారు. త్వరలోనే గుర్తును మీ ముందుకు తీసుకు వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనగల్లు మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల బాధ్యులు పాల్గొన్నారు.