కార్మికుల హక్కుల సాధనకు నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని బీఎన్ఆర్ కెఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరిపెల్లి చంద్రమన్నారు. ఆదివారం మండలంలోని కారుణపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గిన్నార్ మహేందర్ ఆధ్వర్యంలో కార్మికుల హక్కులకై గత 20.సం పూర్తయిన సందర్భంగా పత్రిక విలేకరుల సమావేశం ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక సంక్షేమం కోసం 20 సంవత్సరాలు ధర్నాలు రాస్తారోకోలు చేసి కార్మికుల కై పోరాడిన సంఘటనలు మరువలేని అన్నారు. మన కర్మికులమందరము కలిసి కట్టుగా పనిచేయాలని 1996 లో వున్న కార్మిక చట్టం అమలు కోసం నా శ్వాస ఉన్నత వరకు పోరాడుతమన్నారు. అనంతరం రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్ చెలిమెల రాములు మాట్లాడుతూ..ప్రభుత్వంకు సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డు పొందిన కార్మికుల వేల కోట్ల రూపాయలు,ప్రభుత్వ భవనాలు పై వస్తున్న 1% సేస్సు వేల కోట్ల రూపాయలనీ మా కార్మిక సక్షేమం కోసం కర్చుపెట్టకుండ వేల కోట్ల రూపాయల ను దుర్విియోగము చేసిందని మండిపడ్డారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వము 10సం లలో మా వెల్ఫేర్ బోర్డు కి చెర్మైన్ నీ కూడా నియమించలేదని,అర కొర పథకాలతో మా పొట్టకొట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఇప్పుడైనా భవన నిర్మాణం కార్మికుల సమస్యలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వం లో వున్న సంక్షేమ పథకాలను రెండింతలు చేయాలని, మీ సేవ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంక్షేమ పథకాల అప్లికేన్లను రద్దు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా అధికారులే తీసుకోని, తమ్ బు సిష్టన్ని తీసివేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.ఉపాధి హామీ కులిలని మా వెల్ఫేర్ బోర్డు లో నుండి తొలగించాలని, వారి సభ్యత్వం ను రద్దు చేయాలని ఆరోపించారు.నిజమైన కార్మికులను గుర్తించి వారికి 10 లక్షల వరకు పని ముట్ల మీద లోనూ సౌకర్యం కల్పించి ఆదుకోవాలన్నారు. కార్మికుల సభ్యత్వ కార్డు 60సం నిండిన వారిని బోర్డు నుండి తొలగిస్తుందని, దాన్ని శాస్వత కాలం పని చేసే లాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల కోసం ఉచిత మోటర్ సైకిల్ లను పంపిణీ చేసి ఈ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని తెలిపారు.55సం లకే పెన్షన్ సౌకర్యం కల్పించాలి,వెల్పర్ బోర్డుకు కార్మికుడినే ఛైర్మెన్ గా నియమించలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎన్ ఆర్ కె ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తొట్ల పర్శరములు జిల్లా నాయకులు నల్ల స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు సాదిక్, జిల్లా నాయకులు గిన్నారపు రవి, జిరిపోతుల సారంగపాణి కోడూరి లింగాస్వామి. తదితరుల పాల్గొన్నారు.