కవిత అరెస్టుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో

నవతెలంగాణ – రెంజల్

లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు చేయించిన ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు శేషు గారి భూమారెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో కేసు నడుస్తూ ఉండగా కవితక్కను అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు పై ఆయన మండిపడ్డారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేసుకోవాలి కానీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయరాదని వారు స్పష్టం చేయడంతో ఇరువురి మధ్య వాగ్ వివాదం చోటుచేసుకుంది. సీఐ ఆదేశాల మేరకు రోడ్డుపై కాకుండా రోడ్డు కింద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాఘవేందర్ కాశం సాయిలు, గోపాల్ రెడ్డి, అనిల్, తిరుపతి రాము, ఆశాడి భూమయ్య, పేరోజ్ బేగ్, తగిలేపల్లి అంజయ్య, గంగారెడ్డి, బోర్గం లక్ష్మణ్, రవి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.