పంటపొలాల్లో దొంగల హల్ చల్..

– గత వారం పది రోజుల నుండి వరుస దొంగతనాలు..

– పంట పొలాల ట్రాన్స్ఫార్మర్ల టార్గెట్..
– పోలీసులకు ట్రాన్స్కో అధికారులకు, రైతులకు చిక్కని దొంగలు
– చీకటి పడిందా ట్రాన్స్ఫార్మర్ కతం…
– ఆయిల్ కాపర్ వైర్లె టార్గెట్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలో పంట పొలాల దొంగతనాలు హల్చల్ చేస్తున్నాయి. గత 15 రోజుల నుండి ఏదో ఒక గ్రామంలో కచ్చితంగా పంట పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లలో చోరీ జరుగుతుంది. పంట పొలాల ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్గా దొంగతనాలు కొనసాగుతున్నాయి. యాసంగి పంటలు పూర్తిచేసుకుని వర్షాకాలం పంటకు సిద్ధమవుతున్న రైతన్నకు దొంగలు దడ పుట్టిస్తున్నారు. రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక గ్రామంలో కచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ చోరీ జరుగుతుంది. పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న ఆయిల్ కాపర్ వైర్ చోరీ చేస్తున్నారు. గత 15 రోజుల నుండి నాగిరెడ్డిపేట్ , ధర్మ రెడ్డి, ఎర్రారం, లింగంపల్లి, వేంకంపల్లి గ్రామాలలో గల పంట పొలాల ట్రాన్స్ఫారం నుండి ఆయిల్ కాపర్ వైర్ చోరీ చేయడం జరిగింది. నాగిరెడ్డిపేటలో ఒకటి ధర్మారెడ్డి లో ఒకటి ఎర్రారంలో రెండు లింగంపల్లిలో ఒకటి వెంకంపల్లి లో ఒకటి  ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ కాపర్ వైర్ చోరీకి గురి కావడం జరిగింది. వానాకాలం పంటకు సిద్ధమవుతున్న రైతన్నకు ఈ దొంగతనాలు తలనొప్పిగా మారాయి. ఈ దొంగతనాలు జరగడానికి కారణం లోకల దొంగల నాన్ లోకల్ దొంగల అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజులకొకసారి కచ్చితంగా నాగిరెడ్డిపేట మండలంలో ట్రాన్స్ఫార్మర్ ల  చోరీ కొనసాగుతుంది. వరుస దొంగతనాలు జరగడంతో ట్రాన్స్కో అధికారులకు తలనొప్పిగా మారింది.
ట్రాన్స్కో ఏఈ..మనోరంజన్ వివరణ..
గత 15 రోజుల నుండి నాగిరెడ్డిపేట మండలంలో పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్ కాపర్ వైర్లు చోరీకి గురి కావడం జరుగుతుంది.  కంజుమార్లతో పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించడం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ పరస దొంగతనాలు జరగడం వల్ల గ్రామాల్లో రైతులు , యువత ఒక పథకం ప్రకారం గ్రామాల్లో టీంలుగా ఏర్పడి ఆ దొంగలను పట్టుకునే విధంగా కృషి చేస్తే దొంగలను పట్టుకోవచ్చు.
ఎస్సై రాజు వివరణ..
నాగిరెడ్డి పేట మండలంలో పంట పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ల లోనుండి ఆయిల్ కాపర్ వైర్ చోరీ కావడం వాస్తవమే. దానికి సంబంధించి పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఈ సమస్య నాగిరెడ్డిపేట మండలం తో పాటు నిజాంసాగర్ ఎల్లారెడ్డి పిట్లం మండలాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కచ్చితంగా దొంగలను పట్టుకొని తగిన శిక్ష పడేలా చేస్తాం. గ్రామాలలో గాని పంట పొలాల్లో గాని కొత్త వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రాజు పేర్కొన్నారు.