జువ్వాడి గ్రామంలో దొంగలు అరెస్ట్

నవతెలంగాణ గాంధారి: మండలంలోని జువ్వాడి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వడ్ల పండరి ఇంట్లో దొంగతనం జరుగగా అదే గ్రామానికి చెందిన పండరి బంధువులైన వడ్ల రాకేష్, అతని అన్న అయిన వడ్ల శ్రీకాంత్ ఇద్దరు కలిసి దొంగతనం చేసి, దొంగిలించిన సొత్తు ను గాంధారి శ్రీ సాయి స్టీల్ లో అమ్మటానికి ప్రయత్నించగా యజమానికి అనుమానం వచ్చి పోలీస్ లకి సమాచారం ఇవ్వగ నిందితులని పట్టుకొని విచారించి వారి వద్ద నుండి పూర్తి సొత్తు ను స్వాధీన పర్చుకొని నేరస్తులని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించామని గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు