బాన్సువాడలో  దొంగలు బాబోయ్

– ఒకే రోజు రెండు షాపుల్లో చోరీ 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన  షాపులను టార్గెట్‌ చేస్తున్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి రెండు దుకాణాల శేటర్ లను పగలగొట్టి నగదు వీలైన వస్తువులను ఎత్తుకెళ్లారు. షేక్ వహాబ్ కు చెందిన సిమెంటు దుకాణం షట్టర్ తాళాలను పగలగొట్టి  వేల రూపాయల నగదు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అలాగే మహమ్మద్ హఫీజ్ కు చెందిన పాన్ షాప్ పగలగొట్టి నగదు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.  ఓ పథకం ప్రకారం దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు.  రాత్రి దుకాణాలు వేసి ఉదయం తాళాలు తీసేందుకు వెళ్లగా అప్పటికి తాళాలు పగలగొట్టి ఉండడంతో దుకాణం యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. బాన్సువాడ టౌన్ సిఐ ఎం కృష్ణ వారి సిబ్బందితో దుకాణాలను పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. పట్టణంలో నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించి దొంగలను పట్టుకొని చోరీ జరిగిన సొత్తు రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.