నవ తెలంగాణ- మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1 పరివాహక ప్రాంతంలో గిరిజనుల (నాయకపు) ఇండ్లకు ఉన్న తలుపులు,కిటికీలు ఎత్తుకెళ్ళి దొంగలు హాల్ చల్ సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి శనివారం వచ్చింది. స్థానికులు పూర్తి కథనం ప్రకారం గిరిజనుల ఇండ్లు రెండేళ్ల క్రితం ఓసిపిలో తవ్వకాల్లో కోల్పోయి పరిహారం, ఆర్అండ్ ఆర్ ప్యాకేజి జెన్కో కంపిని ఇటీవల ఇచ్చింది. అయితే గిరిజనులు అక్కడి నుంచి రాలేకపోతున్నాము అనడంతో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ సంస్థ స్వచ్ఛందంగా గిరిజనులకు భూమి కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణాలు చేసింది. ఇండ్లు ఎంచరామి వేళ్లు ప్రధాన రోడ్డు ప్రక్కన నిర్మించారు. చిట్యాల మండలం తండాకు సంబంధించిన కొందరు వ్యక్తులు గత నెల 28న ఐదు ఇండ్ల కిటికీలు, ఈ నెల 1న ఎనిమిది ఇండ్లకు సంబంధించిన తలుపులతోపాటు కిటికీల గ్లాస్ లు దొంగిలించి రహస్యంగా దాచి ఈ నెల 2న ఎడ్లబండిలో ఎత్తుకెళ్లినట్లుగా గిరిజనులు బండి అడుగులు, దొంగల అడుగులను గుర్తింపు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం నలుగురు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా తెలిసింది. అందులో ఇద్దరిని తండా స్థానిక ప్రజాప్రతినిధులు విచారించగా ఇద్దరు ఒప్పుకొన్నట్లుగా ఇండ్లకు సంబంధించిన తలుపులు, కిటికీలు కాపురం చేరినట్లుగా విశ్వనీయ సమాచారం. మొదట ఒక్కరిద్దరు గిరిజనులు తలుపుల దొంగతనంపై కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతటి దొంగతనానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ఓసిపిలో 24 గంటలు కార్మికులతో హడావిడి ఉన్న ఇక్కడ దొంగతనం జరగడం గమనార్హం.