
ఆర్మూర్ మండల కేంద్రంలో వీధి నెంబర్ 18 లో ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం తెలుగులోకి వచ్చింది. బయ్య శివలింగం కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లడంతో ఎవరూ లేని సమయం చూసి దొంగలు ఇదే సమయమని శనివారం రాత్రి ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లోకి చోరపడ్డారు. బీరువా పగలగొట్టి బీరువా నుండి రెండు తులాల ఐదు మాసాల బంగారం రూ.10500/- రూపాయలు నగదు విలువైన పట్టు చీరలు సుమారు 50 వేల వరకు ఉన్న కొత్త చీరలు,25 తులాల వెండి, సామాగ్రి ఇత్తడి సామాను దొంగతనానికి చొరబడ్డారు. వారి కూతురు సర్టిఫికెట్స్ ,ఇతర సామాను దొంగిలించి చిందరమందరం చేసి వంట గదిలో ఉన్న కారంపొడి ఇల్లంతా చల్లి వెళ్లిపోయారు. ఇరుగుపొరుగువారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం తెలుపగా.. కుటుంబ సభ్యులు వచ్చి చూసి బోరును విలపించారు. పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.