రెచ్చిపోతున్న ట్రాన్స్ ఫార్మర్ల దొంగలు..

Thieves of angry transformers..– వ్యవసాయ పోలల్లో ఉన్నవే లక్ష్యంగా చేసుకున్న దొంగలు..

– మండలంలో ఇప్పటివరకు 5 ట్రాన్స్ఫార్మర్లు చోరీ..
ఇంకా ఎన్ని జరగాలి అంటున్న రైతులు..
భారీగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన..
నవతెలంగాణ – క్రిష్ణా 
మండలంలో ట్రాన్స్‌పార్మర్ల లోని విలువైన కాపర్‌ వైర్‌, ఆయిల్ అపహరించే దొంగగాళ్లు రెచ్చిపోతున్నారు. పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ అందులో ఉన్న కాపర్, ఆయిల్ ను దొంగలిస్తున్నారు. రైతులు నార్లు పోసుకుని శెనగ, మొక్కజొన్న పంటలు పెట్టుకన్న సమయంలో ట్రాన్స్‌ పార్మర్లు చోరీకి గురవుతుండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం మండలంలోని తంగడిగి శివారులోని చిగనూరు దేవప్ప అనే రైతు పొలంలో 25 హెచ్పి ట్రాన్స్ఫార్మర్ ను దొంగలించి దుండగులు దానిలో ఉన్న విలువైన కాపర్, ఆయిల్ వస్తువులను దొంగలించారు, దీంతో రైతు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు, వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫారమును అమర్చడానికి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల ఖర్చు అవుతుందని, ఈ దొంగతనాలతో రైతులు భారీ నష్టపోతున్నారని గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వరుస దొంగతనాలతో రైతులు భయాందోళన చెందుతున్నారని, గతంలోనూ ఇదే విధంగా చోరీలు జరిగినా దొంగలను ఇప్పటి వరకు పట్టు కోలేదని రైతులు అంటున్నారు. మండలంలో దాదాపుగా 5 నుంచి 6 ట్రాన్స్ఫర్లు వరుసగా దొంగతనం జరుగుతున్నాయని ఇటువంటి దొంగతనాలు ఇంకా ఎన్ని జరిగితే అధికారులు దొంగలను పట్టుకుంటారని తమ బాధను వ్యక్తం చేశారు. దొంగలు రోజంతా వ్యవసాయ పొలాల చుట్టూ తిరుగుతూ ట్రాన్స్‌పార్మర్స్‌ను గమనించి రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దొంగతనాలు జరిగితే తాము వ్యవసాయాం చేయడం కష్టమని అంటున్నారు. లక్షల ఖర్చులు చేసుకొని వరి వేరుశనగ మొక్కజొన్న పంటలు వేసిన రైతులు, ట్రాన్స్ఫారం దొంగతనంతో పంటలకు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులకు తమ బాధను చెప్పుకున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘాను పెంచి దొంగతనాలను నివారించాలని రైతులు కోరుతున్నారు.