ఇసుక అక్రమ రవాణా అని అరికట్టాలనీ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం పసర ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి డీడీలు ఆధారాలు లేకుండా గోదావరి నుండీ వరంగల్, హైదరాబాద్ నాగరాలకు అక్రమంంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను అటవీ అధికారులు పట్టుకోగా సీపీఐ(ఎం) నాయకులు విచారణ జరిపి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోవాలని అన్నారు. ఈ నెల 9న పస్రా అడవిలో ఎలాంటి డి డి ఆధారాలు లేకుండా ఇసుక తరిస్తున్న నాలుగు లారీలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారని అయన అన్నారు. డ్రైవర్లు, క్లీనర్లని సీపీఐ(ఎం) పార్టీ ఆరా తీయగా.. మంగపేట మండలం లోని సంబయ్యగూడెం లోని ఇసుక క్వారియందు లోడ్ చేసుకున్నట్లుగా తేలిసిందని అయన అన్నారు. అలాగే మంగపేట తాహసీల్దార్ ఇచ్చిన అనుమతి పత్రం కేవలం ఆ మంగపేట మండలం వరకే పరిమితి ఉండగా అదే అనుమతి పత్రం తో పట్టణాల వరకు ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని తెలియజేసారు.ఇప్పుడు పట్టుకుంది నాలుగు లారీలు మాత్రమే అని ఇలా పట్టుబడకుండా వెళ్లిన ఇసుక లారీలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ కళ్ళు గప్పి జరుగుతున్న ఈ ఇసుక దందాని వెంటనే అరికట్టెందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమములో సీపీఐ(ఎం) నాయకులు పొదిళ్ల చిట్టిబాబు, గొంది రాజేష్, కడారి నాగరాజు, సప్పిడి ఆదిరెడ్డి, ముమ్మడి ఉపేంద్ర చారి, బ్రహ్మచారి, బుర్ర శ్రీను, అంబాల మురళి, మంచోజు బ్రహ్మచారి,సీపీఐ(ఎం) నాయకులు తదితరులు పాల్గొన్నారు.