
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన తీగల గిరిధర్ రెడ్డి నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డైరెక్టర్లు రామసహాయం మమతా దేవి , బత్తుల నాగమల్లు, సంగెం నరసయ్య, వాసం వెంకన్న, కారింగుల ఏక సాయిలు, ఎండి నసీమా బేగం, బానోతు శ్రీను, భూక్య మధు ,పాక అమృత మల్లు కొమ్ము వెంకన్న , బండారు దయాకర్ లను నియమించినట్లు తెలిపారు.