
సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా తీగల నాగయ్య జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వికరించారు. ఇక్కడ జిల్లా అధికారిగా ఉన్న బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ పై వెళ్లారు ఆయన స్థానంలో డీఆర్ డీఏలో ఏపీడీగా పనిచేస్తున్న నాగయ్య ను సూర్యాపేట జిల్లాకు బదిలీ చేశారు. శనివారం కలెక్టరేట్ లోని ఆ శాఖ కార్యాలయం లో ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా వచ్చిన నాగయ్య కు జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎస్ విరాకుమార్,ప్రాంతీయ ఉద్యాన అధికారి కన్నా జగన్ లు వారి సిబ్బంది తో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లొ సిబ్బంది నరహరి, మురళి, ఝాన్సీ, నరేష్, నరేందర్, డ్రిప్ కంపెనీ సిబ్బంది మల్లేష్, అనిల్, సైదులు , అఖిల్, శ్రీకాంత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను, అడిషనల్ కలెక్టర్ లు ప్రియాంక, వెంకటరెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిశారు.