ఇష్టా రాజ్యాంగ వ్యవహరించే కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలి: తీగల సమ్మయ్య

నవతెలంగాణ – రామగిరి
నిర్మితమవుతున్న డ్రైనేజీ పనుల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య మాట్లాడారు.. నాగపల్లి గ్రామంలో నిర్మితమవుతున్న నాలుగు వరుసల పెద్దపల్లి – మంథని రహదారి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న మెయిన్ డ్రైనేజీ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడుతూ,  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టర్ పై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని అన్నారు. అలగే సదరు కాంట్రాక్టర్ అనుకూలంగా ఉన్నవారికి అనుగుణంగా, కానివారికి కష్టతరం అయ్యేలా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న మెయిన్ డ్రైనేజీ ఒక స్థలంలో రహదారి కంటే కిందికి, మరో స్థలంలో రహదారికి ఎత్తుగా డ్రైనేజీ నిర్మిస్తూ అవకతవకలకు పాల్పడుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా డ్రైనేజీ నిర్మాణంలో ప్రభుత్వ ఆర్ అండ్ బి అధికారి పర్యవేక్షణ లేకుండానే పనులు చేస్తూ, డ్రైనేజీ నిర్మాణానికి కాలువ తవ్వకుండానే బెడ్డు నిర్మిస్తూ నాసిరకపు పనులు చేస్తున్నారన్నారు. నిర్మాణంలో పనులను పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ అధికారి ఇటువైపుగా రాకపోవడాన్ని ఆసరాగా చేసుకోని ఇష్టారాజ్యంగా వివరిస్తున్న సదరు కాంట్రాక్టర్ సూపర్వైజర్ లను ట్యూబ్స్ టెస్ట్ చేశారా అని ప్రశ్నిస్తే కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్ లోనే ఉంటాయని ఇక్కడ మరల టెస్ట్ చేయరని వింత జవాబులు ఇచ్చారన్నారు. డ్రైనేజీ నిర్మాణంలో వైబ్రేటర్ వాడడం లేదని ప్రశ్నిస్తే చేతి కర్రతో పనికానిస్తున్నామని నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ, అవి ఏవి మాకు సంబంధం లేదనీ, పని చేస్తున్నాం మీకు ఏమైనా అనుమానం ఉంటే కంప్లైంట్ చేసుకోమనీ అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టి దారించి నాగపల్లి గ్రామంలో నిర్మితమవుతున్న డ్రైనేజీ అవకతవకలపై విచారణ జరపాలని సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.