మూడో రోజు ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు..

– మూడు కేంద్రాల పరిధిలో 49 మంది గైర్హాజర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారంతో మూడో రోజుకు చేరగా,  ఫ్లైయింగ్ స్క్వాడ్ సంపత్ కుమార్ తనిఖీలు నిర్వహించారు.  నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జూనియర్,టి.ఎం.ఆర్,వీకేడీవీఎస్ ఆర్ జూనియర్ కళాశాలల్లోని మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో ప్రధమ సంవత్సరం ఆంగ్ల పరీక్ష లో మొత్తం 936 మంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉండగా,887 మంది విధ్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారు. 49 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు. తహశీల్ధార్ ఎం.శ్రీనివాస్,సీఐ కరుణాకర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీను, ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ లు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్ లు విధులు నిర్వహిస్తున్నారు.
పరీక్షా కేంద్రం        ఎలాట్మెంట్     ఆబ్సెంట్        ప్రజెంట్
జి.జేసి                   376            21              355
టిఎం ఆర్ జేసీ         167            09              158
వీకేడీవీఎస్ఆర్ జేసీ    393           19               374
మొత్తం                  936            49              887