దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ దారుణం

– సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి :వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దొంగతనం చేశారన్న అనుమానంతో దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమనీ, ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధిత దళిత మహిళకు మెరుగైన వైద్యం అందించాలనీ, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు.