సీపీఐ(ఎం) మూడో జాబితా

సీపీఐ(ఎం) మూడో జాబితాకోదాడ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : మట్టిపెల్లి సైదులు
స్వగ్రామం : రాఘవాపురం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా
తల్లిదండ్రులు : మట్టిపెల్లి రామచంద్ర, ఎల్లమ్మ
రాజకీయ ప్రస్థానం : ప్రస్తుతం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మోతె మండల కన్వీనర్‌గా, డీివైఎఫ్‌ఐ సూర్యాపేట డివిజన్‌ కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ కార్యదర్శిగా పని చేశారు.
మునుగోడు నియోజకవర్గం
అభ్యర్థి పేరు : దోనూరి నర్సిరెడ్డి
తల్లిదండ్రులు : దోనూరి అచ్చమ్మ-లింగారెడ్డి
స్వగ్రామం : ఉమ్మడి సర్వేల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని నాగంవారిగూడెం
రాజకీయ ప్రస్థానం : 1985లో సీపీఐ(ఎం) సభ్యులుగా చేరారు. 2009లో మునుగోడు డివిజన్‌ కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి, 1983లో పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా, సర్వేల్‌ గ్రామపంచాయతీ వార్డు మెంబర్‌గా, 2004లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆలిండియా కమిటీ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, సీఐటీయూ జిల్లా కోశాధికారిగా ఉన్నారు.
ఇల్లందు నియోజకవర్గం
అభ్యర్థి పేరు : దుగ్గి కృష్ణ (50)
తల్లిదండ్రులు : అనంతమ్మ, నరసయ్య
సామాజిక తరగతి : ఎస్టీ (కోయ)
ప్రస్తుత నివాసం : కామేపల్లి
సొంతూరు : మద్దులపల్లి గ్రామం, కామేపల్లి మండలం.
రాజకీయ ప్రస్థానం : మద్దులపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని దుగ్గి కృష్ణ సీపీఐ(ఎం)లో పనిచేశారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడిగా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకునిగా కొనసాగుతున్నారు. 2003లో పోడు భూముల కోసం రీబ్యాక్‌ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి 59 రోజులు వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు.