– 12 రాష్ట్రాలు, యూటీలలో 94 స్థానాలకు పోలింగ్
– ఇప్పటికే ముగిసిన రెండు విడతలు
న్యూఢిల్లీ : భారత్‌లో మూడో విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నది. ఈనెల 7న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)లలో గల మొత్తం 94 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన అనేక మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి, రెండో దశలు ముగిశాయి. మొదటి దశ ఏప్రిల్ 19న జరగగా.. రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి.
రాష్ట్రాలవారీగా ఎన్నికలు జరగబోయే స్థానాల సంఖ్య
మూడో దశలో భాగంగా అసోం (4 సీట్లు), బీహార్ (5 ), ఛత్తీస్‌గఢ్ (7), గోవా (2), గుజరాత్ (26), కర్నాటక (14), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర (11), యూపీ (10), పశ్చిమ బెంగాల్ (4) రాష్ట్రాలతో పాటు దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ (2), జమ్మూ కాశ్మీర్ (1) వంటి యూటీలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మే 13, మే 20, మే 25, జూన్ 1 పలు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగి తుది ఫలితాలు వెలువడనున్నాయి.
ఆయా రాష్ట్రాల్లోని స్థానాలు ఇవే
అసోం నుంచి.. ధుబ్రి, కోక్రాఝర్, బార్పేట, గౌహతి నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. బీహార్‌లో.. ఝంఝర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనున్నది. ఛత్తీస్‌గఢ్‌లో సర్గుజా, రారుఘర్, జంజ్గిర్చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రారుపూర్లలో ఎన్నికలు జరగనున్నాయి. గోవా నుంచి నార్త్ గోవా, సౌత్ గోవా స్థానాలలకు, గుజరాత్‌లోని అన్ని 26 లోక్‌సభ నియోజకవర్గాలు కచ్, బనస్కాంత, పటాన్, మహేసనా, సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహౌద్, వడోదర, ఛోటా ఉదయపూర్, భారుచ్, బార్డోలి, సూరత్, నవసారి, వల్సాద్ లలో పోలింగ్ జరగనున్నది.
కర్నాటకలోని చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. మధ్యప్రదేశ్ భింద్, భోపాల్, గుణ, గ్వాలియర్, రాజ్‌గఢ్, సాగర్, విదిశలు, మహారాష్ట్రలోని బారామతి, రాయగడ, ఉస్మానాబాద్, లాతూర్(ఎస్సీ), షోలాపూర్(ఎస్సీ), మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగిల్లలో పోలింగ్ జరగనున్నది. యూపీలోని సంభాల్, హత్రాస్, ఆగ్రా (ఎస్సీ), ఫతేపూర్ సిక్రీ , ఫిరోజాబాద్, మైన్‌పురి, ఎటా, బుదౌన్, అయోన్లా, బరేలీలు ఎన్నికలకు సిద్ధం కానున్నాయి. పశ్చిమ బెంగాల్లో మల్దహా ఉత్తర్, మల్దహా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్లు, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.