
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వడ్డేవార్ సాయి సంస్కృతి జాతీయ స్థాయి అబాకస్ పరీక్షలో తృతీయ స్థానం సాధించినట్లు న్యూ ఆదర్శ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ నిర్వహించిన జాతీయ స్థాయి అబాకస్ పోటీలలో సాయి సంస్కృతి ఉత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించిన సాయి సంస్కృతిని పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్యం, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు.