తిరుమల నాథస్వామి జాతర సందర్బంగా జాతీయ స్థాయి ఎడ్ల పందెములు

నవతెలంగాణ – నాగార్జున సాగర్
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్, పెద్దవూర మండలాల పరిధిలో గల కోనేటిపురం శివారు కుంకుడు చెట్టు తండాలో ఈ నెల 12 వతేదీ నుంచి జాతీయ స్థాయి ఎడ్ల పందెములు నిర్వహించడం జరుగుతుందని తిరుమలనాథ ఆలయం ఛైర్మెన్ కల్లూరీ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ దండుబిక్షం సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలనుంచి ఎడ్లు పందెములలో పాల్గొంటాయని అన్నారు.ఈ పోటీలు తిలకించుటకు ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ఈ పోటీలలో ప్రధమ బహుమతి 80,000 ల దాత కీర్తి శేషులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు  జ్ఞాపకార్థం పెరుమాళ్ళ సైదులు రంగుండ్ల, ద్వితీయ బహుమతి 60,000 ల దాత  రమావత్ అక్షిత్ తండ్రి దస్రు-జ్యోతి కుంకుడుచెట్టుతుండ, తృతీయ బహుమతి 40,000 ల దాత  ధనావత్ బాలు నాయక్  మాలోతు హనుమ నాయక్ తిరుమలనాధ రియల్ ఎస్టేట్ మిర్యాలగూడ, నాలుగవ బహుమతి  30,000 ల దాత   మంచర్ల లోకా నాయక్  కుంకుడుచెట్టుతండ,ఐదవ బహుమతి 25,000 ల దాత  రమావత్ రాజేష్ నాయక్  తండ్రి పాండ్య నాయక్ కుంకుడుచెట్టుతండ,ఆరవ వ బహుమతి 20,000 ల దాత బి.భాష బత్తాయి వ్యాపారం, కర్నూలు జిల్లా, వారు దాతలు బహుమతులు ఇస్తున్నారని తెలిపారు.ఎడ్ల పందెముల వివరాలకు పాకాల నాగరాజు యాదవ్, 9849438040, రమావత్ గణేష్ నాయక్ 9133641170, దేవాలయ ఛైర్మన్  కల్లూరి వెంకటేశ్వర్రెడ్డి,వైన్ చైర్మన్ దండు భిక్షం 9963684529,కార్యదర్శి రమావత్ లచ్చిరాం నాయక్,కమిటి సభ్యులు రమావత్ హేమ్లా నాయక్ పాశం నాగార్జున్ రెడ్డి,తుమ్మల పల్లి సుధాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిపగడాల తిరుమల్ యాదవ్,మేగావత్ దశరధ్, రమావత్ శంకర్ నాయక్ లను సంప్రదించాలని కోరారు.