
– మూడు రోజుల పాటు ఎడ్ల పందెములు
– దాతల సహకారం తో బైభవంగా జాతర
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర, తిరుమల గిరి సాగర్ మండలాల పరిధిలోని బోనూతల (కోనేటిపురం )హాలియా నుండి సాగర్ వెళ్ళే మార్గంలో కుంకుడుచెట్టుతండ గ్రామం తూర్పువైపున తిరుమల కొండపై వెలసిన తిరుమలనాథ స్వామి జాతర ఈ 12నుంచి అంగ రంగ వైభవంగా జరుగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు ఆలయ ఛైర్మెన్ కల్లూరీ వెంకటేశ్వర్ రెడ్డి చేశారు. ఈ నెల 11 న ఉదయం 6 గంటలకు 108 కలశములచే పద్మావతి సమేత తిరుమలనాధస్వామి వారికి అభిషేకం, జరుగనుంది. ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ పార్లమెంట్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,ఎంఎల్ ఏ కుందూరు జైవీర్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపిపి ఆంగోత్ భగవాన్ నాయక్, సాగర్ సీఐ బీసన్న,తిరుమలగిరి సాగర్ ఎస్ఐ వీరశేఖర్, పెద్దవూర ఎస్ఐ వీరబాబు హాజరు కానున్నారు.జాతరలో ఆంగోతు బాలాజీ ఏసీపీ, రాజేంద్రనగర్, రమావత్ కృష్ణ కుమార్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, కుంకుడుచెట్టుతండ, హాలియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్,ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతరలో శ్రీ సత్యసాయి సేవా సమితి హాలియా వారు ప్రసాదం, స్వామి వారికీ వెండి కిరీటాల దాత పుచ్చకాయల రమణారెడ్డి – పద్మ దంపతులు ప్రజెంట్ చేశారు. అలాగే ఆలయానికి లైటింగ్ దాత గగ్గినపల్లి హన్మంతరెడ్డి లలిత దంపతులు సహకరించారు.