నవతెలంగాణ – డిచ్ పల్లి
2025-26 యేడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోఅనుత్పాదక రంగమైనా రక్షణ రంగానికి అత్యధికంగా రూ. 4,91,732 కోట్లు, హోం మంత్రిత్వ శాఖకు రూ. 2,33,211 కోట్ల కేటాయించింది. అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల ఆదాయాన్ని పెంచాలి కానీ దేశంలో 45శాతం జనాభాకు ఉపాధి కలిపిస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.2,66,817 కోట్ల కేటాయించాడం విడ్డురంగా ఉంది .మానవ వనరులను సృష్టించే అత్యంత ప్రధానమైన విద్య, వైద్య రంగాలకు జీడీపీలో తగు మోతాదులో కేటాయింపులుండాలి కానీ కేవలం 2. 5 శాతం అనగా రూ. 1,28,650 కోట్లు కేటాయింపులు జరిగాయి. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 98,311 కోట్లు కేటాయించారు. పట్టాణాభివృద్దికి రూ. 96,777 కోట్ల కేటాయించి చేతులు దులుపుకున్నారు.దేశీయ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు గాని ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేసేలా బడ్జెట్ రూపకల్పన జరగలేదు . ఈ బడ్జెట్ లో అమలుకాని అనేక పథకాలను చూపించి ప్రజలను కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టింది.