ఈ ఎన్నికలు మీ తలరాత మీరు రాసుకునే ఎన్నికలు

–   సిరిసిల్లలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు కేటీఆర్
నవతెలంగాణ- సిరిసిల్ల: ఎన్నికలు మీ తలరాత మీరు రాసుకునే ఎన్నికలని తెలంగాణలో కేసీఆర్ గొంతు నొక్కి బొంద పెట్టాలనే ఎజెండాతో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ దండయాత్ర చేస్తున్నారని ఢిల్లీ నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే వారి మాటలు నమ్మవద్దని రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు కేటీఆర్ అన్నారు  జిల్లా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యంగా కావాలా.. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా.. నీళ్ళు కావాలా కన్నీళ్లు కావాలా… కెసిఆర్ స్కీములు కావాలా… కాంగ్రెస్ స్క్యాములు కావాలా ఆలోచించండని కేటీఆర్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు. 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారా… సిరిసిల్లాను సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఆలోచించండన్నారు. పది ఏండ్ల పాలనలో కెసిఆర్ ఎన్నడూ కుల రాజకీయాలు, మత విద్వాంసాలకు తెర తీయలేదని, ఇప్పుడు కుల, మత పిచ్చి గాల్లను ఓటు వేసి గెలిపించి వాటికి తావిద్దామా ఆలోచించాలని కోరారు. రాజకీయంగా జన్మనిచ్చి రాష్ట్రంలో, దేశంలో,  విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల అని సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానన్నారు. 15 ఏండ్లగా అవినీతి రహితంగా పని చేసి, సిరిసిల్ల ముఖ చిత్రం మార్చామన్నారు. ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం  తిరుగుతున్నానని, గడప గడపకు తిరగక పోయిన ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్ననని, గులాబి దండు నాకు అండగా ఉందని గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నానన్నారు. గతంలో తప్పు చేసి 55 ఎండ్లు బాధపడ్డమని, మళ్ళీ తప్పు చేస్తే 50 ఎండ్లు బాధపడవలసి వస్తుందని గుర్తు చేశారు. ప్రలోబాలకు లొంగీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తదని, సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని, సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మున్సిపల్ చైర్ పర్సన్  కళా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య దరువు ఎల్లం తదితరులు పాల్గొన్నారు.