
నవతెలంగాణ – డిచ్ పల్లి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు బారి మెజార్టీ తో విజయ దుందుభి మోగించడం తో దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి మంగళవారం వేర్వేరుగా కలిసి సన్మానించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇమ్మడి గోపి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోకుండా తమ కుటుంబానికి లబ్ది చీకూర్చే విధంగా చూసుకున్నారని, దీంతో ప్రజలు ఆగ్రహించి కనివిని ఎరుగని రీతిలో తీర్పు ఇచ్చారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మాండమైన విజయాన్ని అందజేశారని,ఈ విజయం తో కెసిఆర్ దిమ్మ తిరిగిందన్నారు. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీ మద్య జరిగాయని, ప్రజలు అన్ని ఆలోచించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఇమ్మడి గోపి పేర్కొన్నారు. టిఆర్ఎస్ పాలనలో అరాచకం ఎక్కువగా కావడంతో ప్రజలు భరించుకోలేదని నీతి నిజాయితీగా ఉన్న అభ్యర్థులని ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.