”దేవరకొండలో విజయ్ ప్రేమకథ’, ”ఫోకస్” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో విజయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘పాగల్ వర్సెస్ కాదల్’. శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మించారు. రాజేశ్ ముదునూరి దర్శకుడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ, ‘డైరెక్టర్ రాజేశ్ ముదునూరి ఈ కథ చెప్పినప్పుడు యూనిక్‌గా ఉందనిపించింది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాను. సాఫ్ట్ వేర్ ఎంప్లారు. చాలా ఇన్నోసెంట్ పర్సన్. అయితే ఓ గయ్యాళి అమ్మయిని లవ్ చేస్తాడు. ఇలాంటి భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ప్రేమికుల మధ్య రిలేషన్ ఎలా ముందుకు సాగింది అనేది కథ. ఈ తరం ప్రేమికులంతా ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ కీలకంగా ఉంటాయి. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. నా పెయిర్‌గా నటించిన విషికకు అందరి ప్రశంసలు దక్కుతాయి.