ఈ తరం శ్రీరంగనీతులు

ఈ తరం శ్రీరంగనీతులుసుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్యతారలుగా రూపొందు తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడు. రాధావి ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే ఇది అని టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఫీల్‌ కలుగుతుంది.
టీజర్‌ విడుదల నేపథ్యంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఈ చిత్రంలో ఉండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. సినిమాలో ఉండే ఆసక్తికర మైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్త దనంతో పాటు పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు. ‘నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు.. ఎంటర్‌టైన్‌ మెంట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా ఈ చిత్రం అందరి ఆదరణ పొందు తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత అన్నారు. దీనికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజరు అరసాడ, ఎడిటింగ్‌: శశాంక్‌ ఉప్పటూరి.