ఇది పక్కా బ్లాక్‌బాస్టర్‌ సినిమా

It is perfect Blockbuster movieదర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం తన మూడో చిత్రంగా తెరకెక్కించిన యూనిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీ ‘కీడా కోలా’. విజి సైన్మా బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్‌ సుధాంషు, సాయికష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన హీరో విజరు దేవరకొండ మాట్లాడుతూ,’తరుణ్‌ ‘పెళ్లి చూపులు’తో నాకు లాంచ్‌ ఇచ్చాడు. తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది..’ చేసి ఇంకొంతమందికి కెరీర్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మంచి టాలెంటెడ్‌ యాక్టర్స్‌ కనిపిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మజా ఇస్తుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజారు చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. తరుణ్‌తో ఓ సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నటించడానికి ఏకైక కారణం.. ఇది తరుణ్‌ భాస్కర్‌ సినిమా. ఈ టీం అందరితో కలసి నేను ఓ చిన్నపిల్లోడిలా నటించే అవకాశం నాకు కలిగింది. జంధ్యాల సినిమాలు చేస్తున్నపుడు కామెడీ ఎంత హాయిగా పడిందో మళ్ళీ ఈ సినిమాకి అలాంటి అనుభూతి కలిగింది’ అని బ్రహ్మానందం అన్నారు.
తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ, ‘క్రైమ్‌ కామెడీ నా ఫేవరేట్‌ జోనర్‌. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఫీలౌతున్నాను. నా స్నేహితులు ఉపేంద్ర, కౌశిక్‌, వివేక్‌, సాయి నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా మా గురించి కాదు ప్రేక్షకుల గురించి డిజైన్‌ చేశాం. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. నవంబర్‌ అంతా నవ్వుకోవచ్చు’ అని చెప్పారు.