చలి కాలం ఇలా ఉండాలి!

This is what winter should be like!చలికాలం ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే చాలామంది చలి నుంచి తక్షణ ఉపశమనం కోసం టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల పొట్టలో అల్సర్‌ సమస్య తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఏమేం తినాలి.. తినకూడదో చూద్దాం..
నీళ్లు తాగాలి
దాహం ఉన్నా, లేకపోయినా రోజులో కనీసం నాలుగు లీటర్ల నీటిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అప్పుడే చర్మం తేమగా, ఎండిపోయినట్లు ఉండకుండా మెరుస్తూ ఉంటుంది.
మసాలా ఫుడ్‌ తగ్గించాలి
చలికాలం వచ్చిదంటే చాలా మంది కారం కారంగా, వేడిగా ఉన్న మసాలా ఫుడ్‌ను తింటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల జీర్ణకో శానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇలా..
తులసి ఆకుల్లో యాంటిబయాటిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ నాలుగు ఆకులు నోట్లో పెట్టుకుని, నిదానంగా నమలడం వల్ల జలుబు, ఫ్లూ రావు. కడిగిన తులసి ఆకులను మరిగించిన నీళ్లలో వేసి తాగితే గొంతులో కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లంలోని గుణాలు రోగనిరోధక శకిన్తి బల పరచేలా చేస్తాయి. జలుబు బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం బాగా సహాయ పడుతుంది. గొంతు నొప్పితో బాధపడే వారు వేడి పాలలో గానీ, కషాయంలోగానీ అల్లం వేసుకుని తాగాలి.