ఇది జస్ట్‌ ట్రైలరే : నాని

This is just a trailerనాని, వివేక్‌ ఆత్రేయ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. మంగళవారం సుదర్శన్‌ 35 ఎం.ఎం.థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ,’ సుదర్శన్‌ థియేటర్‌ నాకెంతో స్పెషల్‌. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. ఈ మంత్‌ ఎండ్‌కి అదిరిపోతుంది. ఇక సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉందాం. ఈనెల 29న ఈ సినిమాని థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని అన్నారు. ‘ట్రైలర్‌కి మించి సినిమా ఉంటుంది. సినిమా సూపర్‌గా వచ్చింది. ఫెంటాస్టిక్‌ మూవీ. నాని మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. నాని ఈ సినిమాలో శనివారం బాషా. నిర్మాత డి.వి.వి దానయ్య చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్‌ సెట్‌లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. మంచి ఎనర్జీ ఉన్న సినిమా’ అని ఎస్‌.జె.సూర్య చెప్పారు. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ,’ఇది మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా. నాని, సూర్య విశ్వరూపం చూస్తారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ ఖాయం’ అని అన్నారు. ‘ట్రైలర్‌ అదిరిపోయింది. డైలాగ్స్‌ చాలా బావున్నాయి. నాకు చాలా నచ్చాయి. నాని సూపర్‌గా చేశారు. సూర్య స్వాగ్‌ అదిరిపోయింది. ఈనెల 29న ఫీస్ట్‌ ఉంటుంది’ అని హర్షిత్‌ రెడ్డి తెలిపారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత నానితో ఈ సినిమా చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని కథానాయిక ప్రియాంక మోహన్‌ చెప్పారు.