ఇది మామూలు విషయం కాదు

This is not an ordinary thing‘ఈసారి దీపావళికి బాక్సాఫీస్‌ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో కూడా ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మరోసారి వస్తుందా లేదా అనేది చెప్పలేం. ఈ పోటీలో ‘క’ సినిమా తట్టుకుని నిలబడి, ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ ఈ సినిమాను రూపొందించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణా రెడ్డి నిర్మించారు. దీపావళికి విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
నిర్మాత చింతా గోపాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాళ్లు కూడా మా మూవీకి వెళ్లి బాగుందని చెబుతున్నారు. నాకు ఎన్నో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. మంచి సినిమా చేశామనే సంతప్తిని ఈ సినిమా మిగిల్చింది’ అని తెలిపారు. ‘మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను. మా టీమ్‌ అందరికీ ఈ సక్సెస్‌ క్రెడిట్‌ దక్కుతుంది. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్‌ చేస్తాను’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ మాట్లాడుతూ, ‘ఇలాంటి కాంప్లికేటెడ్‌ స్క్రిప్ట్‌ను నమ్మి, అవకాశం ఇచ్చిన కిరణ్‌కి, మా ప్రొడ్యూసర్‌ గోపీకి థ్యాంక్స్‌’ అని అన్నారు. ఈ వేడుకలో నిర్మాత బన్నీవాస్‌, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి, డైరెక్టర్లు అనిల్‌ విశ్వనాథ్‌, వశిష్ట, హీరో సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు.