ఇది తెలంగాణ జలవిజయం

మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ జలవిజయం సాధించిందంటూ మంత్రి టీ హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా కవితాధోరణిలో స్పందించారు. నాడు ఎటు చూసినా తడారిన నేలలు..నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి. నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు.. నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జలవిజయం.. కేసీఆర్‌ సాధించిన ఘన విజయం. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..ఊటలు జాలువారుతున్న వాగులు..
పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదశ్యాలు.
ఇది కదా జల తెలంగాణ.. ఇది కదా కోటి రతనాల మాగాణ అంటూ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.