తొలి టెస్ట్‌కు ఆసీస్‌ జట్టు ఇదే

This is the Aussie team for the first Test– బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ
సిడ్నీ: ఈనెల 22నుంచి జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌తో తలపడే ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు ప్రకటించింది. యువ బ్యాటర్‌ మెక్‌స్వీనేకు చోటు కల్పించిన బోర్డు… 13మంది ఆటగాళ్ల బృందానికి కెప్టెన్‌గా కమిన్స్‌ ఎంపికయ్యాడు. తొలి టెస్ట్‌కు సీనియర్లకు చోటు కల్పించిన బోర్డు.. యువ ఆటగాడు మెక్‌స్వీనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా ఏ జట్టు అయితే సిరీస్‌ను చేజిక్కించుకుంటే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్స్‌కు చోటు దక్కించుకోనున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. భారతజట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ వైట్‌వాష్‌కు గురవ్వడంతో ఈ సిరీస్‌ గెలుపు తప్పనిసరి అయ్యింది. భారత్‌ 4-0తో టెస్ట్‌ సిరీస్‌ను నెగ్గితే నేరుగా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరనుంది.
తొలి టెస్ట్‌కు ఆసీస్‌ జట్టు: కమిన్స్‌(కెప్టెన్‌), బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, హేజిల్‌వుడ్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, ఖవాజా, లబూషేన్‌, లియాన్‌, మిఛెల్‌ మార్ష్‌, మెక్‌స్వీనే, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌.