
నవతెలంగాణ – మాక్లూర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ బడ్జేటేనాని రైతు, కార్మిక, పేద ప్రజల శ్రేయస్సు కోరే బడ్జెట్ కాదనీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. గురువారం మండలంలోని బోర్గం (కే) గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేషెట్టి సాయిరెడ్డి,. మండల కార్యదర్శి కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.