బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇవే చివరి ఎన్నికలు

This is the last election for BJP and Congress– ఎప్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్‌
బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇవే చివరి ఎన్నికలని, ఓట్లు వేస్తే దేశం అధోగతి పాలవుతుందని తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో కేసీఆర్‌ గెలుపు కోసం స్థానిక కోట మైసమ్మ నుంచి ఇంద్ర పార్క్‌ అంబేద్కర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ మరో 20 ఏళ్ల పాటు బీఆర్‌ఎస్‌యే అధికారంలో ఉంటుందన్నారు. నియోజకవర్గంలో బీజేపీ ఊసేలేదన్నారు. కాంగ్రెస్‌కి డిపాజిట్‌ కూడా రాదన్నారు. గజ్వేల్‌లో సీఎం చేసిన అభివద్ధిని చూసి కేసీఆర్‌ను ప్రజలు లక్ష మెజార్టీతో గెలిపిస్తాన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జాకీర్‌, కౌన్సిల్‌ సభ్యులు బొగ్గుల చందు, బాలమణి శ్రీనివాస్‌ రెడ్డి, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, అర్చన శివకుమార్‌, శ్యామల మల్లేష్‌ యాదవ్‌, రజిత గౌడ్‌, కూరాకుల శ్రీనివాస్‌, మామిడి విద్య రాణి శ్రీధర్‌, రహీముద్దీన్‌, గంగిశెట్టి చందన రవీందర్‌, అత్తిలి శ్రీనివాస్‌, సహిన సమీర్‌, అల్వాల బాలేష్‌, ఉప్పల మెట్టయ్య, తలకొక్కల భాగ్యలక్ష్మి దుర్గ ప్రసాద్‌, లక్ష్మి కిషన్‌ రెడ్డి, గుంటుకు శిరీష రాజు, గోపాల్‌ రెడ్డి తదితరులున్నారు.