గతేడాది రైల్వే లైన్ల ప్రగతి ఇదీ…

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రైల్వే లైన్ల నిర్మాణంలో అత్యధిక పురోగతి సాధించినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జోన్‌ పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 39 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ల నిర్మాణం, 54 కి.మీ.గేజ్‌ మార్పిడి, 133 కి.మీ., రెండవ రైల్వే లైన్‌, 190.కి.మీ., మూడవ రైల్వే లైన్‌ పనులు పూర్తి చేశామని తెలిపారు. రైలు వ్యవస్థను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనలో దక్షిణ మధ్య రైల్వే నిబద్ధతతో వ్యవహరిస్తుందన్నారు.